100 రోజులు పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata Completes 100 Days Successfully,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu,Sarkaru Vaari Paata Movie Completes 100 Days,SuperStar Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Completes 100 Days Successfully,Director Parasuram Sarkaru Vaari Paata Movie Completes 100 Days,Mahesh Babu and Keerthy Suresh latest Super Hit Movie Sarkaru Vaari Paata Completes 100 Days

ఒకప్పుడు సినిమాలు 100రోజులు ఆడేవి, 365 రోజులు ఆడేవి అంటూ అంటుండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టం. ఇప్పుడు 50 రోజులు అంటేనే పెద్ద విషయంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇక 100 రోజులు అంటే అది గొప్ప విషయమే. ఈమధ్యకాలంలో మన తెలుగు సినిమాలు కొన్ని 100 రోజులు పూర్తి చేసుకోవడం మన ఇండస్ట్రీకి కలిసొచ్చే అంశమే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ నుండి వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ మేకోవర్, మహేష్-కీర్తి సురేష్ కెమిస్ట్రీ, థమన్ పాటలు ఈసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ లోనూ తన సత్తా చూపించింది ఈసినిమా. ఇక ఈసినిమా మే 12న భారీ ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో నేటితో ఈసినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తెలిపింది.

కాగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇంకా ఈసినిమాలో నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం.. మధి సినిమాటోగ్రఫి అందించారు.

కాగా ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + one =