త్వరలో బింబిసార హిందీ వెర్షన్ రిలీజ్

Bimbisara Movie Hindi Version To Release Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Latest Updates,Bimbisara Latest Movie Updates,Bimbisara Telugu Movie To Release in Hindi,Hero Kalayan Ram,Nandamuri Kalyan Ram,Kalyan Ram To Release Bimbisara in Bollywood,Bimbisara in Bollywood,Bimbisara To Release in Bollywood,Makers of the Bimbisara Movie Planning to Release Movie in Hindi Version,Bimbisara in Hindia Version

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న బింబిసార మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.“బింబిసార” మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బింబిసార మూవీ తెలుగుభాష లో మాత్రమే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో తాము ఆశించే స్థాయిలో రెస్పాన్స్ వస్తే, అప్పుడు మిగతా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పారు. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను సొంతం చేసుకుంది.దాంతో కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ని ఇతర భాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. హిందీలో కార్తికేయ 2 భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో , బింబిసారను ముందుగా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నారనీ , అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయనీ సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =