లైగర్ కు స్పెషల్ ఎమోజీ

Liger Movie Team Crazy Promotions On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Promotions,Liger Movie Crazy Promotions on Twitter,Vijay Deverakonda,Rowdy Hero Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie Crazy Promotions,waat laga denge,Liger Hunting Begins,Twitter Emojis For Liger Movie,Liger Movie Gets Twitter Emojis,Ananya Panday and Vijay Deverakonda Upcoming Movie Liger,Liger Movie Team Crazy Promotions in Twitter with Twitter Emojis

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాను అదే రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. విజయ్ కు సౌత్ నుండి నార్త్ లో కూాడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి చిత్రయూనిట్ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ పాల్గొంటూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా లైగర్ సినిమా ఎమోజీని సాధించింది. కొన్ని సినిమాలకు ఈమధ్య ట్విట్టర్ ఎమోజీలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. మంచి క్రేజ్ ఉన్న సినిమాలకు, హీరోలకు ఈ ఎమోజీలను ట్విట్టర్ సంస్థ ఇస్తుంటుంది. ఇప్పుడు లైగర్ సినిమాకు కూడా స్పెషల్ ఎమోజీ లభించింది. ప్రభాస్ సాహో సినిమా తర్వాత కేజీయఫ్ 2, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు ఎమోజీని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లైగర్ సినిమాకు ట్విట్టర్ ఎమోజీని క్రియేట్ చేసింది దాంతో లైగర్ టీమ్ ట్విట్టర్ కు థాంక్స్ చెపుతున్నారు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =