“లాల్ సింగ్ చడ్డా” మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది – చిరంజీవి

Chiranjeevi About Laal Singh Chaddha Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chirajeevi,Chiranjeevi,Chiranjeevi about Laal Singh Chaddha,Laal Singh Chaddha Movie,Laal Singh Chaddha, Laal Singh Chaddha Telugu Version,Laal Singh Chaddha Telugu Movie,Laal Singh Chaddha in Telugu,Laal Singh Chaddha Hindi Movie,Laal Singh Chaddha Bollywood Movie, Bollywood Star Hero Amir Khan Upcoming movie Laal Singh Chaddha,Akkineni Nagachaitanya,Naga chaitanya,Naga Chaitanya Upcoming Movie in Bollywood, Naga Chaitanya in Laal Singh Chaddha,Naga Chaitanya with Amir Khan in Laal Singh Chaddha Movie,Chiranjeevi Says Telugu Audience Will Love Watching Laal Singh Chaddha Movie, Chiranjeevi About Telugu Audience

వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్‌” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చడ్డా ” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“లాల్ సింగ్ చడ్డా ” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చడ్డా” మూవీ సెల‌బ్రిటీ స్పెష‌ల్ ప్రీమియర్ షో, అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవిగారు, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున‌, నాగ‌చైతన్య‌, మెగానిర్మాత అల్లు అర‌వింద్, యువ హీరోలు సాయితేజ్, అల్లు శిరీష్, కార్తికేయ‌, ద‌ర్శ‌కులు మారుతి, హ‌రీశ్ శంక‌ర్, నిర్మాత‌లు సురేశ్ బాబు త‌దిత‌రులు హ‌జ‌రైయ్యారు . ప్రీమియ‌ర్ షో అనంత‌రం, ప్రిమియ‌ర్ షోకి వ‌చ్చిన అతిధుల‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..అమీర్ ఖాన్ అంటే తన కెంతో ఇష్టమనీ ,అమీర్ సినీ ఇండస్ట్రీ కి ఒక ఖజానా లాంటి యాక్టర్ మాత్రమే కాదు భారత దేశంలో ఒక గర్వించదగ్గ నటుడనీ , ఈ చిత్రాన్ని తెలుగులో స‌గౌర‌వంగా స‌మ‌ర్పిస్తున్నాననీ , ఓ బాధ్య‌త‌గా ఫీల్ అవుతున్నాననీ , అలానే ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉందనీ , ఆ పాత్ర‌కు తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతారనీ , మంచి సినిమాలు వ‌స్తే తెలుగు ప్రేక్ష‌కులు క‌చ్ఛితంగా ఆద‌రిస్తార‌నే విష‌యం మ‌ళ్లీ మ‌ళ్లీ రుజువు అవుతూనే ఉందనీ , తాజాగా విడుద‌లైన “బింబిసార‌”, “సీతార‌మం” చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రించడం తనకు చాలా ఆనందంగా ఉందనీ , ఇదే రీతిన ఆగ‌స్ట్ 11న విడుద‌ల కాబోతున్న “లాల్ సింగ్ చడ్డా”ని కూడా ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌ని మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.