ప్రియదర్శి, నభా నటేష్ జంటగా డార్లింగ్

Priyadarshi, Nabha Natesh Starrer Darling Announcement Glimpse Released

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి, ఇస్మార్ట్ భామ నభా నటేష్ జంటగా ఒక కొత్త సినిమా తెరకెక్కుతోంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ సహా పలువురు నటీనటులు నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తుండగా.. చైతన్య రెడ్డి సగర్వంగా సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే పేరు ఖరారు అయింది. ‘వై దిస్ కొలవరి?’ అనేది టాగ్ లైన్‌గా ఉంది. ఈ మేరకు చిత్రబృందం శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా యూట్యూబ్‌లో ‘డార్లింగ్’ సినిమా ఎనౌన్స్‌మెంట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది. కాగా గత కొన్నిరోజులుగా ప్రియదర్శి, నభా నటేష్ ఇరువురూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మూవీ లవర్స్ గమనించే ఉంటారు. అయితే ఇదంతా ఈ సినిమా ప్రచారంలో భాగం అని నేటితో తేలిపోయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =