మ్యాచో హీరో గోపీచంద్-మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. ఎన్నో అంచనాల మధ్య జులై 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 6కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీన్ని బట్టి ఈసినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు ఈసినిమాతో. ఇక మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో రెండో రోజు కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక రెండురోజుల్లో ఈసినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేసింది. మరి వచ్చే శుక్రవారం వరకూ పెద్గగా సినిమాలు లేవు కాబట్టి ఆలోపు ఇంకా కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉందటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#PakkaCommercial collects 𝟏𝟎.𝟓 𝐂𝐑 Worldwide in 2 Days! 🔥💥
Watch the ACTION – FUN Family Entertainer on big screens! 🤩
🎟️: https://t.co/BcOUguIiyK #AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @GA2Official @adityamusic pic.twitter.com/SP7lWSOy70
— GA2 Pictures (@GA2Official) July 3, 2022
కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈసినిమాను గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్య రాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: