మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ,ఫస్ట్ హంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ” ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ బాలయ్య తిరిగి కోలుకొని “#NBK 107 “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్లి నందమూరి బాలకృష్ణను కలిసి “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” మూవీ టీమ్ బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: