“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పక్కా కమర్షియల్” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో హీరోగా “తొలివలపు” మూవీ లో నటించాననీ , ఆ సినిమా పరాజయం పొందటం తో చాలా రోజులు అవకాశాలు రాలేదనీ , దర్శకుడు తేజ గారు పిలిచి “జయం” సినిమాలో విలన్ రోల్ చేస్తావా?అని అడిగితే ఓకే చేశాననీ , ఆ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో మీకు తెలుసుననీ , ప్రభాస్ తో తన ఫ్రెండ్ షిప్ “వర్షం” సినిమా నుంచే అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుముందు నుంచి మేము మంచి స్నేహితులమనీ , ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అయినా కలిసినప్పుడల్లా మళ్లీ ఒక సినిమా చేద్దామని అంటూ ఉంటారనీ , తప్పకుండా మళ్లీ కలిసి నటిస్తామనే నమ్మకం తనకు ఉందనీ , ఇక స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి కూడా తాను రెడీగానే ఉన్నాననీ , కాకపోతే ఆ పాత్ర డిఫరెంట్ గా .. నెక్స్ట్ లెవెల్లో ఉండాలనీ , ఏదో చేశామంటే చేశాము అన్నట్టుగా ఉండకూడదనీ , పాత్ర నచ్చితే చేయడానికి మాత్రం తాను సిద్ధంగానే ఉన్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: