మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పక్కా కమర్షియల్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ … గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడనీ , కళాశాలలో తన సీనియర్ అయిన ఆయన తన లోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారనీ , అందుకే నాకెప్పుడూ ఆయన ఒక హీరోలాగా కనిపిస్తుంటారనీ , ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారనీ , గోపీచంద్ సినిమాల్లో తనకు “సాహసం” బాగా నచ్చిందనీ , “ఒక్కడున్నాడు”, “చాణక్య” వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ గోపీచంద్ కమర్షియల్ హీరోగా ఎదిగాడనీ , మారుతి సినిమాల్లో “ప్రేమకథా చిత్రమ్”,”భలే భలే మగాడివోయ్”, “ప్రతిరోజూ పండగే” సినిమాలు తనకు బాగా నచ్చాయనీ , అన్ని హంగులున్న “పక్కా కమర్షియల్” సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: