తమిళ్ స్టార్ హీరో కార్తి మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకుంటూ విభిన్నతను చూపిస్తుంటాడు. ప్రస్తుతం కార్తీ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్ అనే సినిమా చేస్తున్నాడు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు పొన్నియన్ సెల్వన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా ఈసినిమాతో పాటు సర్దార్ అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు అభిమన్యుడు మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేక్ర్స. ఈసినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అన్నపూర్ణ సంస్థ సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని అన్నపూర్ణ సంస్థకూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
The Chaos will be 🔛 with his ARRIVAL ! @Karthi_Offl ‘s Most Awaited Film #Sardar AP & TS Distribution Rights Bagged by #AnnapurnaStudios 💥
WW Releasing this DIWALI 🧨🎇#SardarDiwali 💥@Psmithran @Prince_Pictures @RaashiiKhanna_ @rajisha_vijayan @gvprakash @RedGiantMovies_ pic.twitter.com/OwH14sbSDg
— Annapurna Studios (@AnnapurnaStdios) June 27, 2022
కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. రజీషా విజయన్, లైలా, యోగి సేతు, మునీష్కాంత్, మాస్టర్ రిత్విక్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: