టాలీవుడ్ మూవీస్ భారీ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ తో పోటీపడి తెలుగు మూవీస్ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. తెలుగు మూవీస్ సక్సెస్ రేట్ అధికంగా ఉండటంతో కోలీవుడ్ హీరోలు , దర్శకులు టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్నారు. తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివకార్తికేయన్ టాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతిశెట్టి జంటగా“#NC 22” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. బ్లాక్ బస్టర్ “ఖైదీ “, “విక్రమ్ “మూవీస్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ , పలు బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ కి దర్శకత్వం వహించిన అట్లీ టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: