7 డేస్ 6 నైట్స్ మూవీ రివ్యూ

7 Days 6 Nights Movie Review,7 Days 6 Nights Movie Public Talk,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Latest Movie Public Talk, Latest Telugu Movie Public Talk and Reviews,Public Reviews and Ratings,Tollywood Movie Reviews and Rating,Telugu Film Movie Reviews and Public Talk,latest Telugu Movie Review, 7 Days 6 Nights Telugu Movie Review,7 Days 6 Nights Review,7 Days 6 Nights Movie Review And Rating,7 Days 6 Nights Review And Rating, 7 Days 6 Nights Movie Premiere Show Review,7 Days 6 Nights Movie Premiere Show Response,7 Days 6 Nights Pre Review, 7 Days 6 Nights Movie Pre Review,7 Days 6 Nights (film),7 Days 6 Nights Movie (2022),7 Days 6 Nights Movie Plus Points, 7 Days 6 Nights FDFS Review,7 Days 6 Nights First Review,7 Days 6 Nights Movie First Review,7 Days 6 Nights Movie Critics Review, 7 Days 6 Nights Movie Public Response,7 Days 6 Nights Movie Highlights,7 Days 6 Nights Movie Story, 7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights (2022),7 Days 6 Nights Movie Review (2022), 7 Days 6 Nights Movie Updates,7 Days 6 Nights Movie Latest News and Updates,7 Days 6 Nights Telugu Movie Live Updates,Sumanth Ashwin, Meher Chahal,Rohan,Kritika Shetty,MS Raju

ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 7డేస్ 6నైట్స్. డర్టీహరి సినిమా తరువాత ఎం.ఎస్ రాజు తీసిన సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేసింది. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా హిట్ అయింద్ లేదా? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రోహన్, క్రితికా శెట్టి, సుష్మ, రిషికా బాలి, గోపరాజు రమణ తదితరులు
డైరెక్టర్.. ఎం.ఎస్ రాజు
బ్యానర్స్.. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్
నిర్మాతలు.. సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్
సంగీతం.. సమర్థ్‌ గొల్లపూడి
సినిమాటోగ్రఫి.. నాని చమిడి శెట్టి

కథ

ఆనంద్ (సుమంత్ అశ్విన్), కుమార మంగళం అలియాస్ మంగళం (రోహన్) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిలో ఆనంద్ సినిమా డైరెక్టర్ కావాలన్న పాషన్ తో ఉంటాడు. మరోవైపు మంగళం యాక్టర్ కావాలనుకుంటాడు. అలా సాగుతుండగా మంగళంకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇంకా వారం రోజుల్లో పెళ్లి అనగా బ్యాచలర్ పార్టీ కోసం ఇద్దరు గోవాకు వెళ్తారు. వారం రోజుల్లో పెళ్లి అవ్వాల్సిన రోహన్ గోవాలో అమియా (కృతికా శెట్టి) అనే యువతితో ప్రేమలో పడుతాడు. అయితే అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగా ఆనంద్ సూసైడ్ చేసుకొనేంతగా ఆలోచనల్లో పడుతాడు. ఆనంద్ కు రితిక (మెహర్ చాహల్)‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఈక్రమంలో మంగళంకి పెళ్లి కుదిరింది అనే విషయం అమియాకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆమె మంగళం పై ఎలా రియాక్ట్ అయ్యింది? ఆనంద్- రితిక ల ప్రేమ సంగతి ఏమైంది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

ఒకప్పుడు ఎం.ఎస్ రాజు టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా మారి డర్టీ హరి లాంటి థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. ఇక మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు 7 డేస్ 6నైట్స్ సినిమాను కూడా తీయడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా కూడా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగానే తీశారు. ఒకవైపు లవ్ ఫైయిల్యూర్ అయిన ఫ్రస్ట్రేషన్ మరోవైపు డైరెక్టర్ కావలని చేసే ప్రయత్నాలు, రోహన్ ఎంగేజ్‌మెంట్, గోవా ట్రిప్‌కు బయలుదేరడం ఇలా కాస్త ఫన్‌గా సాగుతుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆనంద్‌లో ఎమోషన్ యాంగిల్, మానసిక సంఘర్షణ కథకు బలంగా మారాయనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దర్శకుడు సెన్సిటివ్‌గా డీల్ చేసిన అంశాలు యూత్‌కు మంచి ఫీల్‌ను కలిగిస్తాయి.

ఆనంద్ పాత్రలో సుమంత్ ఆశ్విన్ బాగానే చేశాడు. ఇక ఇంతకు ముందు ఎమోషనల్ పాత్రలు చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది సుమంత్ కు. అందుకే ఇప్పుడు కూడా ఆనంద్ పాత్రలో చాలా ఈజీగా చేసేశాడు. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది మంగళం పాత్రలో చేసిన రోహన్ గురించి. ఈ పాత్ర యూత్ కు ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. మంగళంగా రోహన్ ఎనర్జీ బాగుంది. తన పాత్ర ద్వారా మంచి ఫన్ క్రియేట్ చేశాడు. మొదటి సినిమా అయినప్పటికి నటనతో, డైలాగ్, ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భవిష్యత్తులో మంచి అవకాశాలే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాట్స్‌గా కనిపించిన మెహర్ చాహల్‌లో లుక్స్ చాలా బాగున్నాయి. కృతికా శెట్టి కూడా గ్లామరస్ పాత్రలో బాగానే చేస్ంది. అంతేకాకుండా కొంతమేర నవ్వించే ప్రయత్నం కూడా చేసింది. ఇక గోపరాజు రమణ మిగిలి నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గోవా లొకేషన్స్ ను బాగా కాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఓకే. సమర్థ్ గొల్లపూడి.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా నిర్మాణంలో సుమంత్ కూడా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి యూత్ కు కనెక్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈసినిమా నచ్చుతుందని చెప్పలేము.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − six =