రత్నం నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. డీఎస్‌పీని ఆకాశానికెత్తిన విశాల్

Rathnam Third Single Praanam Released From Vishal's New Film

తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవలే ‘మార్క్ ఆంటోని’తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విశాల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల క్లబ్ మూవీగా నిలిచింది. దీని తర్వాత ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’. మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పేరొందిన సీనియర్ డైరెక్టర్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ‘రత్నం’ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘ప్రాణం నా ప్రాణం’ అంటూ సాగే ఈ పాటకు విరించి పుట్ల సాహిత్యం అందించగా.. సింగర్స్ కపిల్ కపిలన్, రణినా రెడ్డి ఆలపించారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘ప్రాణం నా ప్రాణం’ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో హీరో విశాల్ ఎక్స్ వేదికగా దీనిపై స్పందిస్తూ.. “నేను విన్నది నమ్మలేకపోతున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకు ‘ప్రాణం’ అనే పదాలు నా పాటలన్నింటిలో కీలక పాత్ర పోషించాయి మరియు ఎక్కువ ప్రభావం చూపాయి. డార్లింగ్ డీఎస్‌పీ.. మీరు నిజంగా రాక్‌స్టార్. ఇంతకుముందు మా రత్నం సినిమాలోని మాస్ హిట్‌ల మధ్య ఇంత మనోహరమైన లిరికల్ మెలోడీని అందించడం అద్భుతం. మీరు కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రతి ప్రేమికుడి పెదవులపై ఉంటుంది. ఇది నా సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 26వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =