సుధీర్ బాబు హరోంహర షూటింగ్ పూర్తి

Sudheer Babu's Harom Hara Movie Shooting Wrapped up Today

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వ‌హిస్తున్నారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు సరసన మాళవికా శర్మ కథానాయికగా న‌టిస్తుంది. అరవింద్‌ విశ్వనాథన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈసినిమా నుంచి విడుదలైన టీజ‌ర్‌ సహా పాట‌లు సినీ ప్రియులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. నేటితో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చివరి షాట్ పూర్తయిన వెంటనే యూనిట్ సభ్యులు గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటున్న వీడియోను పంచుకుంది. అలాగే “త్వరలోనే థియేటర్లలో సుబ్రహ్మణ్యం మాస్ సంభవం సుసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ అందులో పేర్కొంది.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సుధీర్‌బాబు కుప్పం యాసలో మాట్లాడనున్న‌ట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో సునీల్, ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + seven =