రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈఏడాదే మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా చిరు అప్పుడప్పుడు పొరపాటున తన సినిమాలకు సంబంధించిన విషయాలను లీక్ చేసేస్తుంటారు. ఆచార్య టైటిల్ దగ్గర నుండి ఇప్పటి వరకూ చాలా విషయాలను చెప్పేశారు. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న చిరు మరో లీక్ చేసేశారు. ఈసినిమాను ఆగష్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ స్టార్టింగ్ లో కాని రిలీజ్ చేస్తున్నామని చెప్పేశారు. ఇక థమన్ కూడా మరో లీక్ చేసేశాడు. సింగింగ్ ప్రోగ్రామ్ కు జడ్జిగా ఉన్న థమన్ విజేతకు గాడ్ ఫాదర్ లో పాడే అవకాశం ఇచ్చాడు. బ్రదర్ అండ్ సిస్టర్ సాంగ్ అని.. చిరంజీవి, నయనతార బ్రదర్ అండ్ సిస్టర్లుగా నటిస్తున్నారని చెప్పేశాడు. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి కలిగింది.
కాగా ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: