ఆది- లావణ్య త్రిపాఠి పులి మేక వెబ్ సిరీస్ ప్రారంభం..!

Lavanya Tripathi Aadi Web Series Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi Latest Updates,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi New Movie Updates, Lavanya Tripathi Latest Web Series,Lavanya Tripathi New Web series Launched,Lavanya Tripathi Aadi Webseries Launched

ఓటీటీల ప్రభావం ఈమధ్య కాలంలో ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇక ఓటీటీలలో సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసినా వెబ్ సిరీస్ లు హడావుడి కనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి హీరో హీరోయిన్లు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ఈనేపథ్యంలోనే ఆది సాయి కుమార్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ‘పులి మేక’ అనే టైటిల్ తో ఈవెబ్ సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ‘ఓ టి టి’ సంస్థలలో ఒకటి అయిన ‘జీ 5’ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దర్శకులు అయిన అనిల్ రావిపూడి, బాబి పాల్గొన్నారు. దర్శకుడు బాబి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

కాగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈవెబ్ సిరీస్ కు కె.చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇంకా ఈవెబ్ సిరీస్ లో పాటు సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. మరి జీ5 నుండి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు వచ్చి స్ట్రీమింగ్ అయ్యాయి. ఒక చిన్నఫ్యామిలీ స్టోరీ, లూజర్, గాలివాన లాంటి వెబ్ సిరీస్ లు రాగా అవి మంచిగా హిట్ అయ్యాయి. దీంతో ఈవెబ్ సిరీస్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.