టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. హడావుడి లేకుండా ఒక్కొక్క సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఇక మాస్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో గోపీచంద్ ఎక్స్ పర్ట్ అలానే మాస్ సినిమాలు అంటే బాలయ్య ఎలా చెలరేగిపోతాడో తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు నటసార్వభౌముడు, విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు శత జయంతి. ఈసందర్భంగా నేడు ఈసినిమా నుండి బాలకృష్ణ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కత్తి పట్టుకుని బాలయ్య..రౌద్రంగా కన్పిస్తున్నాడు. ఇక పోస్టర్ లో మాస్ అవతారంలో ఉన్న బాలయ్య లుక్ ఆకట్టుకుంటుంది. మరోసారి బాలయ్య మాస్ఎంటర్ టైనర్ తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది.
#NBK107 🔥🔥 pic.twitter.com/lTR9poxqfi
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: