కమల్ హాసన్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు బారీ రెస్పన్స్ వచ్చింది. మరోవైపు జూన్ 3వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఇప్పుడ తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈసినిమాలో కమల్ ఎక్కువ జోక్యం చేసుకున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమా విషయంలో కమల్ హాసన్ గారు ఎంతమాత్రం జోక్యం చేసుకోలేదు. ఒక నటుడిగానే ఆయన సహకరించారు తప్ప, దర్శకత్వంలో ఉన్న అనుభవం కారణంగా నా పనిలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు. దర్శకుడిగా ఆయన నాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు.
కాగా ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా సూర్య కూడా ఒక పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: