ఈఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య. ఈ ఏడాదే మరో సినిమాకు కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు చాలా రోజుల నుండి. దీంతో ఫ్యాన్స్ కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా వారికి స్వీట్ సర్ ప్రైజే ఇచ్చారు మేకర్స్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఈ నెల 25న సాయంత్రం 5.04 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చైతన్య డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసింది సినిమా యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
25th May 5:04pm it is !! #ThankYouTeaser #ThankYouTheMovie pic.twitter.com/aWlSov6i4B
— chaitanya akkineni (@chay_akkineni) May 23, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. . టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా విక్రమ్ కుమార్-నాగ చైతన్య కాంబినేషన్ లో గతంలో ‘ మనం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు మరో సినిమా వస్తుంది. మరి సినిమా నాగచైతన్యకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: