ఎనర్జిటిక్ హీరో రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈక్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంలో బోయపాటి సిద్ద హస్తుడు.. మరోవైపు రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అటు లవర్ బాయ్ పాత్ర ఎలా చేయగలడో.. ఫుల్ మాస్ పాత్రలో కూడా అదే రేంజ్ లో చేయగలడని ఇప్పటికే నిరూపించాడు కూడా. అలాంటి కాంబినేషన్ కాబట్టే ఈకాంబినేషన్ పై మంచి క్రేజ్ ఉంది. ఇక ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే ఇద్దరూ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. దీనికోసం డేట్ ను కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. జూన్ 1వ తేదీ నుండి హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: