పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు హీరోయిన్స్ లో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో జాన్వీ, సారా అలీ ఖాన్, కియారా అద్వాని లాంటి యంగ్ హీరోయిన్స్ ఆ లిస్ట్ లో ఉన్నారు. ఆ తరువాత పలువురు హీరోయిన్లు కూడా విజయ్ తో నటించాలని ఉందని తెలిపారు. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆ హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహనన్. తాజాగా మాళవిక తన సోషల్ మీడియాలో ఆస్క్ మాళవిక పేరుతో సెషన్ ను నిర్వహించగా అందులో తమిళ్ లో స్టార్ హీరోలయిన రజనీ కాంత్ ఇంకా విజయ్ తో సినిమాలు చేశారు.. మీకు ఏ హీరోతో చేయాలని ఉంది అని అడుగగా అందుకు మాళవిక విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని.. మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ లేదా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లాంటి సినిమా అయినా చేయాలని ఉందని తెలిపింది. మరి మాళవిక కోరిక ఎప్పటికి తీరుతుందో చూద్దాం..
Really want to act in a romantic or rom com movie with Vijay Deverakonda 🙂 https://t.co/jWAN9QSn8e
— malavika mohanan (@MalavikaM_) May 18, 2022
కాగా ప్రస్తుతం విజయ్ పూరీ కాంబినేషన్ లో ఫైటర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా పూరీతోనే జనగణమన సినిమా చేస్తున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.