కన్ఫామ్.. విక్రమ్ మూవీ లో సూర్య..!

Suriyas Role In Vikram Movie Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Updates,Kamal Haasan Vikram Movie Updates,Kamal Haasan Sing a Song in Vikram Movie,Kamal Haasan Song Goes Trending in social Media, Hero Suriya joins in Vikram Movie,Suriya in Vikram Movie,Vikram Movie latest Updates,Hero Suriya To act in Vikram Movie,Hero Suriya with kamal Haasan Movie Vikram Latest Updates, Malayalam Star Actor Fahadh Faasil,Actor Vijay Sethupathi in Vikram Movie,Suriya Upcoming Movies,Suriya New Movie Updates,Suriyas Role in Kamal Haasan Movie Vikram Confirmed

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా కోసం కమల్ హాసన్ అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మొదటి నుండీ అనుకుంటున్నట్టే ఈసినిమా యాక్షన్‌ నేపథ్యంలో ఉండి ఆడియెన్స్ ని విపరీతంగా ఆట్టుకుంటుంది. ఇందులో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం మరోసారి చూపించారని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో తమిళ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి ఇంకా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ లాంటి నటులు నటిస్తున్నారు. దీంతోనే ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కమల్ కు ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడన్న వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈసినిమాలో భాగమయ్యారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య. లోకేష్ కనగరాజ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు. “విక్రమ్” వరల్డ్ లో సూర్య కూడా ఒక భాగం అయ్యారని క్లారిటీ ఇచ్చి కన్ఫార్మ్ చేసాడు. మరి సూర్య పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో ఇంకా కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =