సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు , క్యాథరిన్ థ్రెసా జంటగా తెరకెక్కిన “భళా తందనాన “మూవీ మే 6 వ తేదీన విడుదల కానుంది.ఈ మూవీ లో రామచంద్ర రాజు , పోసాని , సత్య , అయ్యప్ప శర్మ , శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి , ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భళా తందనాన”ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ .. దర్శకుడు చైతన్య తీసిన “బాణం ” మూవీ చూశాననీ , పేరుకి చిన్న సినిమా అయినా కూడా ఎక్కడా కూడా చైతన్య అలా తీయలేదనీ , ఇప్పుడు “భళా తందనాన ” కూడా చిన్న సినిమాలా అనిపించదనీ , ఆయన చిన్న సినిమా తీసినా కూడా పెద్ద సినిమాలా తీస్తూ ఆ యాటిట్యూడ్‌ని చూపిస్తుంటారనీ , కథ, కథనం బాగుందనీ , శ్రీ విష్ణు పక్కింటి కుర్రాడిలా ఉంటాడనీ , చేప నీళ్లలోకి ఎంత ఈజీగా వెళ్లిపోతుందో.. మాస్ హీరో షూస్‌లోకి అంత ఈజీగా వెళ్లగలడనీ , హీరో శ్రీ విష్ణుకి మంచి భవిష్యత్తుందనీ , అతను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టుల్లోంచే తనకంటూ తాను ఓ జానర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడనీ , ఇప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడనీ , ఈ సినిమా హిట్ అవ్వాలి.. ఫ్యూచర్‌లో కూడా హిట్లు రావాలనీ , శ్రీ విష్ణు , క్యా థరిన్ ల కెమిస్ట్రీ బాగుందనీ , నిర్మాత సాయి కొర్రపాటి గారు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారనీ ,ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. చైతన్య నుండి మరిన్ని మంచి సినిమాలు రావాలనీ , ట్రైలర్ బాగుందనీ శేఖర్ కమ్ముల చెప్పారు. దర్శకులు రాజమౌళి , శేఖర్ కమ్ముల కు శ్రీవిష్ణు థ్యాంక్స్ చెప్పారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని హీరోయిన్ క్యాథరిన్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: