సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తుండటం..దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తుంటాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్సే వచ్చింది. టీజర్ లోని విజువల్స్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మరోసారి మారిన సంగతి తెలిసిందే కదా. మే 27న రిలీజ్ కావాల్సిన ఈసినిమాను జూన్ 3వ తేదీకు మార్చారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేయనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మే9 వ తేదీన ప్రకటించనున్నట్టు అధికారికంగా తెలిపారు. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
HEAT Begins 🔥#MajorTrailer Shall explode ALL INDIA on May 9
🔗 https://t.co/HtxT08rB8r#SobhitaDhulipala @saieemmanjrekar @SashiTikka @urstrulyMahesh @SricharanPakala @sonypicsindia @GMBents @AplusSMovies @ZeeMusicCompany @ZeeMusicsouth pic.twitter.com/OC0rWnfh6P
— Adivi Sesh (@AdiviSesh) May 4, 2022
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.