హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ 

ntr back to hyderabad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నుపూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు.నిన్న రాత్రి ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా అనంతరం తన కొత్త కారునుతనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ముంబై లో వార్ 2షూటింగ్ వారం రోజులు జరుగగా ఇందులో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తోపాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొన్నాడు.ఈసినిమాలో హృతిక్,ఎన్టీఆర్ హోరాహోరీగా తలపడనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ కు ఇదే మొదటి హిందీ సినిమా.ఆర్ఆర్ఆర్ తో హిందీలోకూడా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ వార్ 2తో  డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఈసినిమా విడుదలకానుంది.

ఇదిలావుంటే తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నాడు.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ ను పూర్తి చేశాక ఎన్టీఆర్ మళ్ళీ వార్2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.అక్టోబర్ 10న దేవర పాన్ ఇండియా మూవీ గా థియేటర్లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 10 =