సినిమా పూర్తయిందంటే సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీతో ఖచ్చితంగా ట్రిప్ వేస్తారన్న సంగతి తెలిసిందే కదా. కొత్త సినిమాను లైన్ లో పెట్టేముందు తన ఫ్యామినితో కలిసి ఫ్రీ టైమ్ ను ఎంజాయ్ చేయడం మహేష్ కు అలవాటు. ఇక సర్కారు వారి పాట షూటింగ్ అయిపోయిందో లేదో తను ఫ్యామిలితో కలిసి ఫారిన్ వెళ్లిపోయారు. అక్కడ సితారతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తునేఉన్నారు. తాజాగా మరో ఫొటోను షేర్ చేశారు మహేష్. తన పెట్ డాగ్ ఇంకా సితారతో హ్యాపీగా రిలాక్స్ అవుతున్న ఫొటోను పోస్ట్ చేసి అందులో ఓన్లీ హ్యాపీస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక పరుశురామ్ దర్శకత్వంలో తను నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాటలు రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడమే కాదు రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ కామెడీ టామింగ్, స్టైలిష్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. దీంతో ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగాయి.
కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: