పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. గతకొద్దికాలంగా ఈచిత్రం సైలెంట్ గా ఉన్నా ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ సందడి మొదలైంది. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా.. ఆతరువాత పలు కారణాల వల్ల చాలా కాలం బ్రేక్ పడింది. ఈమధ్యనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. దీంతో మళ్లీ హరిహర వీరమల్లు సందడి మొదలైంది. షూటింగ్ కు ముందు ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన పవన్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో చూశాం. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. కొద్ది రోజులుగా ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. దసరా కానుకగా ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్రయూనిట్ ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: