బర్త్ డే స్పెషల్ : స్టార్ హీరోయిన్ సమంత బెస్ట్ మూవీ ?

Which movie of Samantha impressed you the most?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Star Heroine Samantha,Samntha,Heroine Samantha Birhtday,Happy Birthday Samantha,Samantha Movie Updates,Samantha Upcoming movies,Samantha Latest Movies, Samantha Birthday Special,Samantha Best Movies,Samantha Super Hit Movies,Samantha Blockbuster movies,Best Movie Of Samantha,Samantha Ye Maaya Chesave Movie, Samantha and Jr NTR Brindavanam Movie,Samantha and Mahesh Babu Dookudu Movie,Samantha Eega Movie,seethamma vakitlo sirimalle chettu Movie,Attarintiki Daredi Movie, S/O Satyamurthy,Janatha Garage,Rangasthalam,Oh! Baby,Smantha's Jaanu Movie,Career Best Movies Of Samantha,Birthday special Movies Of Samantha

ఏ మాయ చేసావె: ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన”ఏ మాయ చేసావె” మూవీ ఘనవిజయం సాధించింది.ఈ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగచైతన్య , సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బృందావనం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “బృందావనం “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ , సమంత తమ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించారు .

దూకుడు : 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు , సమంత జంటగా , భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “దూకుడు “మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు , సమంత తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

ఈగ : వారాహి చలన చిత్రం బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఈగ ” మూవీ ఘనవిజయం సాధించింది. సమంత ప్రేమికురాలుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “ఈగ ” మూవీ బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ గా 2 నేషనల్ అవార్డ్స్ అందుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “మూవీ ఘనవిజయం సాధించి బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ఈ మూవీ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అత్తారింటికి దారేది: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సమంత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అత్తారింటికి దారేది “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ , సమంతల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

S/O సత్యమూర్తి: హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “S/O సత్యమూర్తి” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆన్ స్క్రీన్ లో స్టైలిష్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తూ సమంత తన పాత్రకి న్యాయం చేశారు.

జనతా గ్యారేజ్: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించారు. చిన్న పాత్రలో నటించిన సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ 2 నేషనల్ , 7 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

రంగస్థలం : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా  సమంత అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

ఓ! బేబీ: సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ఓ !బేబీ”మూవీ ఘనవిజయం సాధించింది. సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లలో “ఓ! బేబీ”ఒకటిగా నిలిచింది.

జాను: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ , సమంత జంటగా తెరకెక్కిన “జాను”మూవీ ప్రేక్షక, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ లో సమంత, శర్వానంద్ తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జాను , రామ్ పాత్రలలో సమంత , శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బర్త్ డే స్పెషల్ : స్టార్ హీరోయిన్ సమంత బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here