పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమ్-కామ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ రాఘవ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా, గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు క్రియేటివ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “ప్రియదర్శితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. దర్శకుడిగా నా తొలి షాట్ దర్శి మీదే పెట్టాను. దర్శిని నా మొదటి హీరో. ఈ వేడుకు అతిధిగా రావడం ఆనందంగా వుంది. నిరంజన్ గారితో మూడేళ్ళుగా జర్నీ చేస్తున్నాం. చాలా పాషన్ వున్న నిర్మాత. మంచి కథ ఎక్కడున్నా వింటారు. హనుమాన్ లాంటి పెద్ద సినిమాని తీసే అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. హనుమాన్ విడుదలకు సిద్ధమౌతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇంత మంచి కథని వదులుకోలేనని చెప్పారు. దర్శకుడు అశ్విన్ కి చాలా పాషన్, ఎనర్జీ వుంది. నభా లాంటి మంచి నటి ఈ ప్రాజెక్ట్ లో వుండటం అన్నీ సరిగ్గా సమకూరినట్లయింది. వివేక్ సాగర్ నాకు ఇష్టమైన కంపోజర్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. హను మాన్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది డార్లింగ్ కూడా అంతటి పెద్ద విజయాన్ని సాధించి నిరంజన్ గారికి మంచి, డబ్బు రావాలని, ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అని ప్రశాంత్ వర్మ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: