మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ తాజాగా మల్టీ స్టారర్ మూవీస్ పై ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. నితిన్ , సాయి ధరమ్ తేజ్ లతో సన్నిహితంగా ఉంటాననీ , వారితో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి ఇష్ట పడతాననీ చెప్పారు. విక్టరీ వెంకటేష్ తో వరుణ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ మూవీ “F3” మే 27 వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: