అల్లు అరవింద్ సమర్పణ లో సుకుమార్ రైటింగ్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలోనిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ “మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“18 పేజెస్” అనే డిఫరెంట్ టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్ తాజాగా “18 పేజెస్”మూవీ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది… ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు! ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు అని అంటూ నిఖిల్ చెప్పే డైలాగుతో , అద్భుతమైన విజువల్స్ , బ్యాక్ గ్రౌండు స్కోర్ తో రూపొందిన గ్లింప్స్ ప్రేక్షకులను అలరించింది. విభిన్నమైన ప్రేమ కథ గా తెరకెక్కిన “18 పేజెస్”మూవీపై భారీఅంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: