చిరంజీవి గారిని డైరెక్ట్ చేయలేకపోయా.. ఆ బాధ ఇంకా ఉంది..!

Upendra Emotional Words about Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Upendra,Hero Upendra,Upendra Emotional Words About Chiranjeevi,Upendra About Chiranjeevi,Upendra Emotional Words About Megastar,Megastar Chiranjeevi, Upendra Upcoming Movie,Upendra latest Movies,Upendra New Movie,Upendra New Movie Updates,Upendra Movie Updates,Upendra Emotional Words,Upendra About Directing Chiranjeevi, Upendra Says He Could not direct Chiranjeevi,Upendra Wants To direct Chiranjeevi,Upendra in Ghani movie,Upendra with Varun Tej Movie Ghani

మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మందికి స్పూర్తిదాయకమైన పేరు. కేవలం చిరును చూసే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చిన వాళ్లే. మరి అలాంటి చిరంజీవితో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే ఆ అదృష్టం అనేది మాత్రం కొంత మందికే దక్కుతుంది. అలాంటి అదృష్టమే ఓ విలక్షణ నటుడికి వచ్చినా ఆ అవకాశం చేజారిపోయిందట.. చిరుతో సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధ ఉంది అంటున్నాడు. మరి ఆ విలక్షణ నటుడు ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకపక్క విభిన్నమైన సినిమాలను చేస్తూనే మరోపక్క తెలుగులో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు ఉపేంద్ర. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా గని. ఈసినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 24 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఉపేంద్ర’ సినిమా నుంచి తాను ఏంటో అందరికీ తెలుసని ఆయన అన్నారు. అప్పట్లో రాజశేఖర్ గారితో ‘ఓంకారం’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో చిరంజీవి గారితో కూడా సినిమా చేసే అవకాశం వచ్చింది.. అశ్వనీదత్ గారు ఆసినిమాకు నిర్మాత.. అయితే తనకు ఆ సినిమా దర్శకత్వం వహించే అదృష్టం లేకపోయిందని, ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ దాని గురించి బాధ పడుతుంటానని చెప్పారు. అంతేకాదు గతంలో అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాను.. ఇప్పుడు వరుణ్ తేజ్ తో గని సినిమా చేస్తున్నా.. మెగా ఫ్యామిలీ నాకు అవకాశాలు ఇస్తూనే ఉంది అందుకు చాలా ధన్యవాదాలు అంటూ తెలిపారు. మరి ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిరును డైరెక్ట్ చేసే అవకాశం ఉపేంద్రకు వస్తుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =