ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. ఎంతో కాలం నిరీక్షణ తరువాత.. ఎన్నో అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈసినిమా సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-చరణ్ ల పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై తమ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మాస్టర్ పీస్.. ‘లోడ్, ఎయిమ్, షూట్’ అంటూ కామెంట్ చేశాడు. సాయిధరమ్ తేజ్.. బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేశారు. ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ తనదైన శైలిలో ఫ్యాన్’టాబ్యులస్, ‘ఫ్యాన్’టాస్టిక్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక మాస్టర్ పీస్.. ఆయన అసమానమైన సినిమా దృష్టికి ఈసినిమా ఒక సాక్ష్యం అంటూ కొనియాడారు.
#RRR is the Master Storyteller’s Master Piece !!
A Glowing & Mind blowing testimony to @ssrajamouli ’s Unparalleled Cinematic vision!
Hats off to the Entire Team!! 👏👏@RRRmovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2022
కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. కాగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రావు రమేష్, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: