హరీష్ శంకర్ లాస్ట్ సినిమా గద్దల కొండ గడేష్. ఆ సినిమా తరువాత ఇంతవరకూ హరీష్ శంకర్ సినిమా మరొకటి రాలేదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా లైన్ లో ఉంది. అయితే ప్రస్తుతం పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది కూడా. ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మరో వైపు హరీష్ శంకర్ కూడా తన సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అనుకున్న సమయానికి ‘హరి హర వీరమల్లు’ సినిమా పూర్తయ్యే అవకాశాలు లేవంటున్నారు. అంతేకాదు ఈసినిమా షూటింగ్ ను ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపించడంలేదన్న వార్తలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో హరీష్ శంకర్ మరో సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలు. స్తుంది. ఆసినిమా మరేదో కాదు తను దర్శకత్వం వహించిన దువ్వాడ జగన్నాథం. పవన్ సినిమా లేట్ అవుతుండటంతో ఈ గ్యాప్ లో దువ్వాడ జగన్నాథం సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ముందుకు వెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడట. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో పవన్ సినిమా తెరకెక్కుతుంది. సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: