డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మూవీ లో ఉత్తమమైన నటనను కనబరిచారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.భారీ అంచనాల మధ్య నాలుగు సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఆల్ ఓవర్ ఇండియాలో అద్భుత రెస్పాన్స్ అందుకోవడం విశేషం. అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ పాత్రలను దర్శకుడు రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా మలిచారు. 3 సంవత్సరాలుగా ఏ సినిమా లో నటించకుండా ఇద్దరు స్టార్ హీరోలు “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ లో నటించడం , ఈ మూవీ పై వారికున్న డెడికేషన్ , ఫ్యాషన్ కు నిదర్శనం. ఎన్టీఆర్ , చరణ్ తమ క్యారెక్టర్స్ ను ఒకరు ఎక్కువ , ఒకరు తక్కువ అని కాకుండా పోటీపడి నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ పోల్ గేమ్ సరదాకి మాత్రమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొమరం భీమ్ : గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రను ఆకళింపు చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పులి ని వేటాడే సీన్ , ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్, వెన్ను చూపని యోధుడిలా శిక్షని భరిస్తూ.. ముఖంపై చిరునవ్వు చెరగకుండా విప్లవగీతాన్ని పాడే సీన్‌లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ నభూతో న భవిష్యతి.
అల్లూరి సీతారామరాజు : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడియెన్స్ ను ఇంప్రెస్స్ చేశారు. బ్లాక్ బస్టర్ “రంగస్థలం ” మూవీ తరువాత ఈ మూవీ లో తన పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకు లను అలరించారు.చరణ్ తన ఎమోషనల్ కనెక్టివిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[totalpoll id=”77302″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: