యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ హుషారుగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినందకు డిజప్పాయింట్ అయ్యారా..?
ఈసినిమా రిలీజ్ వాయిదా పడుతున్నప్పుడు మేము కష్టపడింది అంతా వేస్ట్ అవుతుంది అని మొదట్లో కాస్త డిజప్పాయింట్ అయ్యేవాడిని.. కానీ ఆ తరువాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈసినిమా ఎప్పుడు వచ్చినా మాసివ్ హిట్ అవుతుంది.
ఆర్ఆర్ఆర్ షూట్ లో మెమరబుల్ మూమెంట్..?
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ప్రతిరోజూ మెమరబుల్ మూమెంటే నాకు. రామ్ చరణ్ తో షూటింగ్, అలియాతో వర్కింగ్ సూపర్బ్. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దానికోసం ఆరు రాత్రుళ్లు షూట్ చేశాం.
కరోనా టైమ్ లో ఏమైనా భయపడ్డారా..?
మొదట్లో నేను అంతగా భయపడలేదు కానీ నాకు ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం నేను కాస్త టెన్షన్ ఫీల్ అయ్యాను. కరోనా ప్రభావం ఉన్నప్పుడే కేసుల మధ్య షూట్ చేశాం. సెట్స్‌లో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ కోసం ముందు ఏమైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారా..?
లేదు అలాంటివి ఏం చేయలేదు. నేను, చరణ్, రాజమౌళి చాలా సార్లు కలిసి మాట్లాడుకున్నాం. రాజమౌళి చెప్పింది చేసుకుంటూ వేళ్లిపోయాం.
మీరు సినిమా చూశారా..?
ఇంకా సినిమా చూడలేదు. రాజమౌళి ఇప్పటివరకూ మాకు దూరంగానే ఉంచారు. నాకు తెలిసి మరో రెండు రోజుల్లో ఈసినిమా చూస్తామనుకుంటున్నా.. నేనుమాత్రం చాలా ఎగ్జైయిటింగ్ గా ఉన్నా.
ఫ్యాన్స్ మిమ్మల్ని, చరణ్ ను పోల్చి చూడటంపై మీ అభిప్రాయం..?
ఫ్యాన్స్ తమ హీరోల కోసం ఫైటింగ్ చేసే రోజులు పోయాయి.. ఇప్పుడు తమ హీరోలను సాలిడ్ పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. ఇక రాజమౌళి సినిమాల్లో పాత్రలు మాత్రమే గుర్తుంటాయి స్టార్స్ కాదు.
ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించడం కష్టంగా అనిపించిందా..?
ఎలాంటి రిఫరల్ పాయింట్ లేకుండా చేయడం అంటే కొంచం కష్టమే.. కానీ నేను ఏం ఆలోచించకుండా ఓపెన్ మైండ్ తో చేసేశా. కొమరం భీమ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అంతే ఇన్నోసెంట్ గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు.
రాజమౌళితో చేయడం ఎంత టఫ్ గా ఉంటుంది..?
రాజమౌళి ఎప్పడూ టఫ్ టాస్క్ మేకరే. కానీ ఈసినిమాలో నా నుండి రాజమౌళి కొత్తదనం కోరుకున్నాడు. అంతేకాదు నాలో ఎంత పొటెన్షియల్ ఉందో తెలిసిన డైరెక్టర్ రాజమౌళినే.. నా నుండి బెస్ట్ అవుట్ పుట్ వచ్చేంతవరకూ నన్ను పుష్ చేస్తూనే ఉంటాడు.
అలియాతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
అలియాతో వర్క్ చేయడం లవ్లీ ఎక్స్ పీరియన్స్. తను ప్రస్తుతం టాప్ యాక్ట్రెస్ తనతో చేయడం అనేది కల్చరల్ ఎక్స్ ఛేంజ్ లా ఉంది. తన టాలెంట్ మహా సముద్రం లాంటిది.. అలాంటి టాలెంట్ ను ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవాలి.
రామ్ చరణ్ పెర్ఫామెన్స్ గురించి..?
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజు పాత్రలో నటించాడు. ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఈసినిమాలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రలో చరణ్ మరో లెవల్ లో నటించాడు. తన ఫ్యాన్స్ కు ఖచ్చితంగా నచ్చుతుంది. షూటింగ్ టైమ్ లో చాలా ఫన్ ఉండేది.. ఇప్పుడు మేము బ్రదర్స్ లా అయిపోయాం.
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: