కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర లో నటించే అవకాశం ఉందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గాడ్ ఫాదర్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి , సల్మాన్ ఖాన్ ను సాదరంగా ఆహ్వానించారు. భాయ్ సల్మాన్ ఖాన్ వెల్కమ్ , మీ ఎంట్రీ ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచిందనీ , ఉత్సాహం మరో స్థాయికి వెళ్లిందనీ , .మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందమనీ , మీ ప్రెజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదనీ ‘అంటూ చిరంజీవి ట్వీట్ చేసి తమ ఇద్దరి ఫొటోను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి”గాడ్ ఫాదర్” మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: