యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉండగా మరో వైపు
నాగార్జున, వెంకీ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా రీసెంట్ గా అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి ఎప్పుడో తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ఎప్పుడో లాంచ్ చేసినా షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ స్టార్ట్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ నేడు ప్రారంభించారు చిత్రయూనిట్. తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు మేకర్స్. అక్కడే కొన్ని రోజులు షూటింగ్ జరిపి ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మరి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం గోపీచంద్ పలు రీసెర్చ్ లు చేసి.. ఒక మంచి సాలిడ్ కథను బాలయ్య కోసం సిద్దం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మాస్ యాక్షన్ ఫిలింస్ తీయడంతో గోపిచంద్ మలినేని ఎక్పర్ట్. అలాంటి గోపీచంద్ కథకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే మరి అంచనాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. చూద్దాం మరి క్రాక్ సినిమా తో గోపీచంద్, అఖండ తో బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈసినిమా వీరికి ఎలాంటి రిజల్జ్ ఇస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: