తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఆతరువాత అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది. ఈనేపథ్యంలోనే కీర్తి సురేష్ నుండి వస్తున్న మరో మహిళా ప్రాధాన్యమైన సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్ గా రేపు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఉన్న తక్కువ టైమ్ ను ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నిన్న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్విహించారు. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కాగా నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: