ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.“అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా “అఖండ“మూవీకి ప్రేక్షకాదరణ తగ్గిపోవడం విశేషం. ఓటిటిలో విడుదలైన 24 గంటల్లోనే, రికార్డు స్థాయిలో ప్రేక్షకులు యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించారు. తాజాగా “అఖండ“మూవీ పాతరోజులను గుర్తు చేసింది.పూర్వం పండగలకు , ఫంక్షన్స్ కు గ్రామాలలో ప్రొజెక్టర్స్ ద్వారా సినిమాలు ప్రదర్శించేవారు. టెక్నాలజీ పెరగటంతో ఆ ప్రదర్శనలు ఇప్పుడు జరగటం లేదు. తాజాగా పాత రోజుల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మొత్తం బహిరంగ మైదానంలో “అఖండ” మూవీ ను వీక్షించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.