యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే కదా. విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గామి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈసినిమా హక్కులను సొంతంచేసుకోగా ఏప్రిల్ 12వ తేదీ నుండి ఈసినిమా ప్రస్తుతం స్టీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి విదితమే. రిలీజ్ అయిన 72 గంటల్లోపే ఈసినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకొని సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: