తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడు , దర్శకుడు సెల్వ రాఘవన్ సోదరుడు , తలైవా రజినీకాంత్ అల్లుడు ధనుష్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను , తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో స్ట్రయిట్ తెలుగు మూవీస్ తో ధనుష్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 2004 సంవత్సరం నవంబర్ 18 వ తేదీ ధనుష్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్త విని రజినీకాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఎంతో అనోన్యంగా కలిసి ఉండే ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: