టాలీవుడ్ లో కొంతమంది ఉంటారు. వాళ్లకి సినిమా రంగం తప్పా మరొక ప్రపంచం ఉండదు. అలాంటి వాళ్లలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. కుటుంబం మొత్తం ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు చేస్తూనే ఉంది.. ఇక తాత దేశం గర్వించదగ్గ నిర్మాత.. తండ్రి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్.. బాబాయ్ టాలీవుడ్ అగ్ర హీరో.. ఇంతమంది బలగం ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ హీరో. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇంకెవరూ దగ్గుబాటి వారసుడు రానా. నిజానికి కుటుంబం మొత్తం సినీ పరిశ్రమకే పరిమితమవ్వగా.. చిన్నప్పటినుండి అదే వాతారణంలో పెరిగినా రానా మాత్రం ముందు బిజినెస్ అంటూ దూరంగా ఉన్నాడు. 2010లో ‘లీడర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇక అప్పటినుండి
డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే పలు డిఫరెంట్ స్టోరీస్ తో బిజీగా ఉన్నాడు. ఇక నేడు రానా బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పలు అప్ డేట్స్ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రానా చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేస్తూ బర్త్ డే విషెస్ అందించండి.
[totalpoll id=”71493″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: