రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ప్రభాస్ టీజర్ యూట్యూబ్లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి సంచారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Take a journey where the destination is love. Here’s a glimpse of the next song from #MusicalOfAges, #RadheShyam!
Teaser out now, Song releasing on 16th December.#UddJaaParindey #Sanchari #Raegaigal #SwapnaDoorame.Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/mnT58Tm5gf
— UV Creations (@UV_Creations) December 14, 2021
కాగా 1970లో యూరప్ లో ఉండే విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ అనే ఫిజిషియన్ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చిత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: