జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫరియా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఫరియా మరో ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. “ఏక్ మినీ కథ” సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ సినిమాలో హీరోగా వస్తున్న సినిమాలో ఫరియా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ఫరియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా గురించి అందులో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది ఫరియా. ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ నాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కూడా నా పాత్ర యువత కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.. తన పాత్ర నచ్చే ఈ సినిమాకి సైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: