యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ ఆశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసినిమాల్లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మిగిలిన సలార్, ఆదిపురుష్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టేశారు. అయితే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమాలోని మిగిలిన వారితో షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ షూటింగ్ పూర్తయింది కూడా. దీపికా కూడా ఇప్పటికే హైదరాబాద్ వచ్చేయగా టీమ్ ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి షూటింగ్ కూడా మొదలు పెట్టనుంది. తాజాగా ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
𝑰𝒏𝒅𝒊𝒂’𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅’𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂… #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021
కాగా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాకు మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: