బిగ్ బాస్ సీజన్ 5 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 11వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని ప్రస్తుతం 12వ వారం జరుపుకుంటుంది. ప్రస్తుతానికైతే ఇంటి సభ్యులు రావడంతో హౌస్ మొత్తం ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇదిలా ఉండగా 12 వారం నామినేషన్స్‌లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న మానస్ తప్ప మిగిలిన సన్నీ, కాజల్, ప్రియాంక, రవి, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి వీరిలో ఎవరు ఇంటికి వెళతారు అన్నది క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అది ఈవారం ఉపయోగించి ఎవరినైనా ఎలిమినేషన్ నుండి తప్పించమని అడుగుతారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే వినిపిస్తున్న వార్తల ప్రకారం సిరి అలానే ప్రియాంకానే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ప్రియాంక కోసం సన్నీ ఏమైనా వాడుతాడేమో చూడాలి. మరి ఏం జరుగుతుందో.. ఈ ఏడుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెంట్ వరకూ ఆగాల్సిందే. మరి ఈ ఏడుగురిలో ఎవరు హౌస్ నుండి బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”70401″]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: