నవీన్‌చంద్ర-అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల అనుబంధంపై తెరకెక్కిన ఈ కుటుంబకథా చిత్రాన్ని కార్తిక్ తుపురాని తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలకు అలానే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలను పెరిగాయి. ఇక ఈసినిమా ఈరోజు ఓటీటీలో విడుదలైంది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నవీన్ చంద్ర, అవికా గోర్, సాయి రోనక్, సంజన సారథి, దేవి ప్రసాద్, శ్రీ లక్ష్మీ
డైరెక్టర్.. కార్తీక్ తురుపాని
బ్యానర్స్.. మ్యాంగో మాస్ మీడియా, జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత.. జె. జె. ఆర్. రవిచంద్
సంగీతం.. శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి.. అజీమ్ మహమ్మద్
కథ
మాధవ్ (నవీన్ చంద్ర), సుబ్బు (అవికా గోర్) ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. అయితే సుబ్బు కు ఆరోగ్యపరంగా ఒక సమస్య ఉంటుంది. ఈనేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు తలెత్తడంతో.. తన కుటుంబానికి, చెల్లెలికి సాయం చేయడానికి ఇష్టం లేకపోయినా చిన్న వయసులోనే దుబాయ్ వెళతాడు. అయితే అక్కడ కొద్ది రోజులు ఉండగా అనుకోని పరిస్థితుల్లో మాధవ్ తిరిగి ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. మరి అవికాకు ఉన్న ఆ సమస్య ఏంటి.. నవీన్ చంద్ర తన చెల్లెలికి కాపాడుకోగలిగాడా..? అన్నది ఈ సినిమా కథ.
విశ్లేషణ
ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే మలయాళం సినిమాలకు మన సినిమాలకు కొంచం తేడాగా ఉంటుంది. కాస్త కమర్షియల్ టచ్ మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఈసినిమా కథలో కార్తీక్ పెద్దగా మార్పులు చేయలేదు కానీ అక్కడక్కడ కమర్షియల్ టచ్ ఇచ్చాడు. ఇక మనకు ఇష్టమైన మనిషి మనకు దూరమైనప్పుడు పడే ఆవేదనను, ఆ బాధను, వారి జ్ఞాపకాలను మరిచిపోయి నార్మల్ అవ్వడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఈసినిమాలో చూపించారు. కార్తిక్ కూడా అందరూ తీసే కమర్షియల్ సబ్జెక్ట్స్ కాకుండా ఇలాంటి కథను ఎంచుకోవడం మంచి విషయం. ఒకప్పుడు అన్నా చెల్లెళ్ల రిలేషన్ లో సినిమా రావడం చూశాం. మళ్లీ చాలా కాలం తరువాత ఈనేపథ్యంలో సినిమా తీసి ఆకట్టుకున్నాడు.
ఇక ఈసినిమాకు ప్రధాన బలమే నవీన్ చంద్ర-అవికా గోర్. వీరిద్దరూ తమ భుజాలపై సినిమాను నటించారు. నవీన్ చంద్రకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఎమోషన్స్ ను చాలా బాగా పండించగలడు. ఈసినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇక అవికా గోర్ కూడా ఏ పాత్ర అయినా న్యాచురల్ గా చేసేస్తుంది కాబట్టి చెల్లి పాత్రలో అంతే బబ్లీగా అలానే ఎమోషనల్ గా నటించింది. ఇక మిగిలిన నటులు సాయి రోనక్, సంజన సారథి, దేవి ప్రసాద్, శ్రీ లక్ష్మీ తమ పాత్రల మేర నటించారు.
సాంకేతిక విభాగానికి వస్తే శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అజీమ్ మహమ్మద్ తన పనితనం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి బ్రో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్ స్వీట్ బాండింగ్ ను మరోసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.