పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ “పటాస్” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “సుప్రీమ్ “, “రాజా ది గ్రేట్”, “F 2″:ఫన్ & ఫ్రస్టేషన్”, “సరిలేరు నీకెవ్వరు “వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్”F 2″:ఫన్ & ఫ్రస్టేషన్” మూవీ సీక్వెల్ “F 3 “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా అనిల్ రావిపూడి టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అనిల్ తన బర్త్ డే సందర్భంగా తన తదుపరి మూవీస్ గురించి మీడియా కు తెలిపారు. హీరో బాలకృష్ణ తో ఒక సినిమా లైన్ ఓకే అయ్యిందనీ , మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి ఆసక్తి తో ఎదురు చుస్తున్నాననీ , పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ ప్లానింగ్ లో ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: