ఈఏడాది మళయాలం ఇండస్ట్రీ పీక్ సక్సెస్ ను చూస్తుంది.రీసెంట్ గా విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.ఫిబ్రవరి నుండి మొదలైన జైత్రయాత్ర వరుసగా మూడో నెల కూడా కొనసాగుతుంది.రెండు నెలల కిందట వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ,ప్రేమలు, భ్రమయుగం అద్భుతమైన వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇందులో మంజుమ్మల్ బాయ్స్ అయితే 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రేమలు అయితే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత నెలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితంతో దండయాత్రకు వచ్చాడు ఈసినిమా కూడా 200కోట్ల మార్క్ కు దగ్గరలో వుంది.ఇక ఈనెలలో మరో రెండు సినిమాలు కాసులు కురిపిస్తున్నాయి.అందులో ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం ఒకటి.
ఈనెల 11న విడుదలైన ఈసినిమా కేరళలో వరుసగా ఎనిమిదవ రోజు 3కోట్లకుపైగా గ్రాస్ ను రాబట్టింది.దాంతో మొత్తం వసూళ్లు 28కోట్ల మార్క్ కు చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 8రోజుల్లో ఈసినిమా 60కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. వచ్చే వారం లో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఫహద్ ఫాజిల్ కు ఇదే మొదటి 100కోట్ల సినిమా కానుంది.ఈసినిమాతోపాటు కేరళ లో వర్షంగాలక్కు శేషం అనే సినిమాకూడా అదరగొడుతుంది.ఈసినిమా 8రోజుల్లో కేరళలో 21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: